జూలూరుపాడు, సెప్టెంబర్ 24 : జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మండల కేంద్రం నుండి పాపకొల్లు గ్రామం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వినోబా నగర్, రామచంద్రాపురం, గుండెపుడి గ్రామాల్లోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సూరారం, కొత్తూరు, గుండ్లరేవు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసిరాం, ఆర్ అండ్ బి ఏఈ గణేశ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకట్రెడ్డి, దుద్దుకూరు మధుసూదన్ రావు, మంగీలాల్, సీతారాములు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.