చండ్రుగొండ: సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రావికంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వానికి రూ.25కోట్లతో నూతనంగా అలుగు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపటం జరిగిందని, త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని, ఎన్నిక ఏదైనా టిఆర్ఎస్ పార్టీదే విజయమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల్ని పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, త్వరలో అన్ని గ్రామాల్లో పర్యటించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.