టేకులపల్లి, అక్టోబర్ 1: దసరా పండగ సందర్భంగా కార్మికులకు టిప్పర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖాకీ దుస్తులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. చుక్కలబోడు వద్ద అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లారీల యార్డు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..లారీ డ్రైవర్లు లోడింగుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మితి మీరిన వేగంతో వెళితే ప్రమాదాలు జరుగుతాయి అని తెలిపారు .సీసీ కెమెరాలు ఏర్పాటు వలన యార్డులో ఎటువంటి చోరీలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవవధ్యక్షులు కోరం సురేందర్, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నెలవెల్లి నరసింహ రావు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.