రామవరం, ఏప్రిల్ 30 : అతివల ఆత్మ గౌరవాన్ని కించపరిచే అందాల పోటీలను రద్దు చేయాలని జమాతే ఇస్లామి హింద్ రామవరం, రుద్రంపూర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బాసిత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే నెలలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై బుధవారం ఆయన మాట్లాడారు. అమ్మగా, ఆలిగా, తనయగా గౌరవంగా చూడాల్సిన స్త్రీని వ్యాపార వస్తువుగా చేసి అందాల పోటీలు నిర్వహించడం హేయమైన చర్య అన్నారు. భారతీయ సంస్కృతిని అపహస్యం చేస్తూ అందాల పోటీలు నిర్వహించడం మంచిది కాదని, వెంటనే అందాల పోటీల నిర్వహణను విరమించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.