చుంచుపల్లి, సెప్టెంబర్ 01 : దివ్యాంగ బాలబాలికలకు చుంచుపల్లి మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం జీహెచ్ఎస్ బాబూక్యాంప్‌లో భవిత సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 8 రకాల క్రీడా పోటీలు నిర్వహించగా, విజేతలకు పాఠశాల హెచ్ఎం, మండల విద్యాధికారిణి నీరజ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భవిత సెంటర్ ఉపాధ్యాయులు పి.సిధయ్య, ఆర్.సంతోష్‌కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.