బూర్గంపహాడ్, సెప్టెంబరు 03 : చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఒక్కో కేసులో 6 నెలల చొప్పున మూడు కేసులకు సంబంధించి 18 నెలల జైలు శిక్షతో పాటు చెక్కులకు సంబంధించి నగదు చెల్లించాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ గురువారం తీర్పు వెలువరించారు. 2019లో ఖమ్మంకు చెందిన కాంట్రాక్టర్ కిలారు శ్రీనివాసరావు వివిధ దఫాలుగా రూ.22 లక్షలు బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి వద్ద అప్పు తీసుకున్నాడు. దీనికి కిలారు శ్రీనివాసరావు మూడు చెక్కులను వెంకటేశ్వరరెడ్డికి ఇవ్వగా వాటిని బ్యాంకులో వేయడంతో బౌన్స్ అయ్యాయి. ఫిర్యాదుదారు వెంకటేశ్వరరెడ్డి కిలారు శ్రీనివాసరావుపై భద్రాచలం కోర్టులో చెకౌబౌన్స్ కేసులు దాఖలు చేశాడు. ఈ కేసుల్లో వాదోపవాదాలు పూర్తయిన అనంతరం గురువారం శ్రీనివాసరావును దోషిగా తేల్చుతూ న్యాయమూర్తి శివనాయక్ 18 నెలలు జైలు శిక్ష విధించి చెక్కుల మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారు తరపున ప్రముఖ న్యాయవాది ముత్యాల కిశోర్ వాదనలు వినిపించారు.