పాల్వంచ, మే 17 : పాల్వంచ మండలంలోని సీతానగర్ కాలనీకి చెందిన సాయి మహేందర్ నాయక్ (33) అనే వ్యక్తి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. సాయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు. తాగుడుకు అలవాటు పడడంతో ఇంట్లో నిత్యం గొడవలు జరిగివేగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఏప్రిల్ 21వ తేదీ రాత్రి సమయంలో మద్యం తాగిన మత్తులో గడ్డి మందు తాగాడు.
వెంటనే స్థానికులు గుర్తించి ఖమ్మం, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ కూడా చికిత్స అందించలేని పరిస్థితి ఉండటంతో భద్రాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. సాయి భార్య లీల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సురేశ్ కేసు నమోదు చేశారు.