భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 21 : లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నూతన కమిటీ ఎన్నిక లక్ష్మి దేవిపల్లి క్లబ్ లో శనివారం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా లగడపాటి రమేశ్ చంద్, కార్యదర్శిగా కలవల చంద్రశేఖర్, కోశాధికారిగా శ్రీశైలం, జయకుమార్ ను ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన నూతన సభ్యుల అభినందన సన్మాన సభలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు కోనేరు పూర్ణచంద్రరావు, మొర్రిశెట్టి మోహన్ రావు, వర్ధన్ రావు మాట్లాడుతూ.. ఎంతోకాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం సభ్యుడిగా, కార్యదర్శిగా రెండుసార్లు సేవలందించిన లగడపాటి రమేశ్ చంద్ నేడు కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభ పరిణామం అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు లయన్స్ సేవలను విస్తృత పరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు జవహర్ రెడ్డి, షేక్.దస్తగిరి, బిక్కులాల్, చెరకు శ్రీనివాస్, మైనేని మోహన్ రావు, వల్లబ్దాస్ దామోదర్ దాస్, కూర శ్రీధర్, కోనేరు నాగేశ్వరరావు, కె.వెంకన్న, చంద్ర మధుసూదన్ రావు పాల్గొన్నారు.