రామవరం, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవం అంటే జెండా ఆవిష్కరణ మాత్రమే కాదని, బానిస సంకెళ్లు తెంచడానికి మన పూర్వీకులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, నీతి నిజాయితీగా దేశ అభివృద్ధి కోసం కృషి చేసే సంకల్పం చేసుకోవడమేనని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డులోని సుభాష్ చంద్రబోస్ నగర్లో గల మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో ముందస్తుగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేశ సార్వభౌమత్వం, సమగ్రత, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా జీవిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలన్న విద్యార్థుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, టీచర్లు లక్ష్మీ ప్రసన్న, శీరిషా, నీలా, నసురత్, సల్మా, సరస్వతి, విజయలక్ష్మి, నాజీయా, సుహాన, ఖాజా పాల్గొన్నారు.
Ramavaram : పూర్వీకుల త్యాగాలను స్మరించుకుందాం : షేక్ అబ్దుల్ బాసిత్