Dialysis Units | కొత్తగూడెం : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు 200 మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ కోసం సదురా ప్రాంతాలకు వెళుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు, జిల్లా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఉండాలని ఆలోచన చేసి నియోజకవర్గవ్యాప్తంగా ప్రస్తుతం పాల్వంచకు పది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి పది డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదనంగా మరో ఐదు డయాలసిస్ యూనిట్ల కోసం ప్రయత్నం చేస్తానని కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాల కోసం నా వంతు కృషి నేను చేస్తున్నట్లు పేర్కొంది. కార్యక్రమంలో ఆసుపత్రి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధా మోహన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, డీసీహెచ్ ఎస్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.