భౌతిక విచారణకు వ్యతిరేకంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ నిరసన

భద్రాద్రి కొత్తగూడెం : ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ కింద కేసుల భౌతిక విచారణకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలోని అన్ని న్యాయస్థానాలు కేసులను వర్చువల్ పద్దతిలో విచారిస్తున్నప్పటికీ కలెక్టర్ అనుదీప్ కేసుల భౌతిక విచారణకు అనుమతించడం సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని వారు ఆరోపించారు.
క్లయింట్లు, న్యాయవాదులు కోర్టులో భౌతికంగా హాజరుకావద్దని జూన్ 30 వరకు వర్చువల్ విధానంలో మాత్రమే హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అయితే కలెక్టర్ సుప్రీం ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారన్నారు. ప్రతిరోజూ సగటున 25 కేసులు విచారణకు వస్తున్నాయన్నారు. ఒక కేసు కోసం ఇద్దరు న్యాయవాదులు, నలుగురు క్లయింట్లు హాజరుకావడంతో, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి కనీసం 150 మంది రెవెన్యూ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని అసోసియేషన్ నాయకులు అన్నారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ఈ చర్య ఎంతమాత్రం తగదన్నారు.
ఇంత భారీ సంఖ్యలో సమావేశం కావడం క్లయింట్ల జీవితాలతో పాటు న్యాయవాదులకు కూడా ముప్పు తెచ్చిపెడుతుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ హియరింగ్ కోరుతూ బార్ అసోసియేషన్ ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాజేష్, జాయింట్ సెక్రటరీ కసాని రమేష్, కోశాధికారి ఎండి. సాదిక్ పాషా, ఆఫీసు బేరర్లు ఎ కరుణకర్, సంతోష్ సాహు, పర్యవేక్షణ కమిటీ సభ్యుడు మెండు రాజమల్లు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిస్తామని వారు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

