రామవరం, మే13: ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల20న నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాపిత సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకే ఓసీలో జేఏసీ ఏర్పాటుచేసిన సమావేశంలో కాపు కృష్ణ మాట్లాడుతూ..నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు. కోల్ బ్లాక్లను ప్రైవేటీకరించకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అప్పటివరకు కార్మికుల పక్షాన పోరాడుతామని అన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మల్లికార్జున్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, సిఐటియు జనరల్ సెక్రెటరీ మంద నరసింహారావు, ఐఎఫ్ టియు నాయకుల సంజీవరావు, టీబీజీకేఎస్ నాయకులు కాగితపు విజయ్ కుమార్, రాజ్ కుమార్, ఎఐటియూసి నాయకులు వీరస్వామి, గట్టయ్య ఎంఆర్ కే ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు గోపు కుమార్, బిరాజేశ్వరరావు, భీముడు సిఐటియు నాయకులు విజయగిరి శ్రీనివాస్, శ్రీ రామ్మూర్తి పాల్గొన్నారు.