రామవరం, నవంబర్ 19 : “మానవ సేవయే మాధవ సేవ” అని, సమాజంలో ఉన్న పేదవారి అవసరాలు తీర్చే వారిని దైవం కరుణిస్తాడని జమాతే ఇస్లామి హింద్, రుద్రంపూర్, రామవరం శాఖ అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. బుధవారం కొత్తగూడెం చమన్ బస్తీలోని జ్యోతి, బుడిద గడ్డలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో స్వెట్టర్లు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసేవారమని, ఈ సంవత్సరం స్వెటర్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ బాసిత్, అబ్దుల్ మన్నాన్, షమీం, పర్వీన్ సుల్తానా, అయేషా, ఇఖ్రా, వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.