జూలూరుపాడు, మే 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు గురువారం విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటి సభ్యులు ఏకపక్షంగా వ్యవహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించకుండా ఇష్టానుసారంగా పేర్లను సిఫార్సు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వారి అనుచరులకు, ఇదివరకు ఇండ్లు ఉన్న వారినే పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తున్నట్లు ఆరోపించారు.
అర్హులకు అన్యాయం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను గుర్తించకుండా.. అన్యాయానికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్తామన్నారు. గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్దిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో కూడా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏదైనా అవకతవకలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.