బూర్గంపహాడ్, ఆగస్టు 25 : పారిశ్రామికవాడగా పేరున్న మేజర్ సారపాక పంచాయతీలో విరివిగా మొక్కలు నాటి ఆకుపచ్చని వనంలా మార్చాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. మంగళవారం వన మహోత్సవంలో భాగంగా సారపాకలో ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్ కిశోర్నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మసీదు రోడ్డు నుంచి కొత్తగా నిర్మించిన గోదావరి వంతెన వరకు రోడ్డు పక్కన వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రానికి సారపాక మీదుగానే భక్తులు నిత్యం ప్రయాణం చేస్తుంటారని, సారపాక ప్రవేశమార్గం పచ్చదనంతో నిండేలా రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలను నాటించి పంచాయతీ అధికారులు, పాలకవర్గం సంరక్షించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఇప్పటికే వేలాదిగా మొక్కలు నాటించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, ఈజీఎస్ ఏపీవో విజయలక్ష్మి, ఈవో గుగులోత్ రవికుమార్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

పారిశ్రామికవాడ పచ్చని వనంలా మారాలి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావుల ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణ, పల్లె దవాఖానా, క్రీడా ప్రాంగణం వెంబడి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్పందన, పంచాయతీ, ఫారెస్ట్, అంగన్వాడీ, ఆశావర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని కృష్ణసాగర్ ఎస్సీ కాలనీ హెల్సెంటర్లో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్యా మోహన్రావు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగిరెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్ బోడ దివ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఉండేటి గోవర్ధన్, గుర్రం సురేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతరావు, వీవో నాగమణి, నర్సు సుభద్ర, ఆశాలు, గ్రామస్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఊరారా వన మహోత్సవాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు.

పారిశ్రామికవాడ పచ్చని వనంలా మారాలి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి