రామవరం, ఆగస్టు 06 : రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించబడింది. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులలో సేవలందిస్తున్న ఇమాం, మౌజన్ లు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్లోని హజ్ హౌస్లో గల వక్ఫ్ బోర్డు కార్యాలయంలో లేదా జిల్లాలలోని కలెక్టరేట్ లలోని వక్ఫ్ కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు.