టేకులపల్లి, జనవరి 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీలోని గ్రామాలను ఇండియన్ ఇంజీనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) అధికారులు తుషార్ కుమార్, యూపీఎస్సీ 2021 బ్యాచ్ ఉత్తరప్రదేశ్, మహేంద్ర పోర్వాల్, యూపీఎస్సీ 2023 బ్యాచ్ మధ్యప్రదేశ్, రంజన్ కిషోర్, యూపీఎస్సీ 2023 బ్యాచ్, బీహార్, నీరజ్ కుమార్ శర్మ యూపీఎస్సీ 2024 బ్యాచ్ రాజస్థాన్, సుమిత్ మీనా రాజస్థాన్ యూపీఎస్సీ 2024 బ్యాచ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థితిగతులు, రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వ పథకాల అమలు తీరు, జీవన విధానంపై మండలంలోని ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tekulapalli : గ్రామాల స్థితిగతులు, పథకాల అమలుపై ఐఈఎస్ అధికారుల పరిశీలన
మండలంలోని గ్రామాలను సందర్శించి వారి జీవన విధానం, ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వలసకూలీల పరిస్థితులు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని నివేదికలు తయారు చేయనున్నారు. మండల అధికారులు ఆనందకుమార్, ఎంపీడీఓ బైరు మల్లీశ్వరి, ఎంపీఓ గాంధీ, ఏపీఓ శ్రీనివాస్, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సర్పంచ్ పూల్బంతి, ఉప సర్పంచ్ చేతుల నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి శ్వేత, హౌసింగ్ ఏఈ నునావత్ గణేష్, ఫీల్డ్ అసిస్టెంట్ లఖన్, చింతల్లంక పంచాయతీ కార్యదర్శి రుబీనా, మెడికల్ అధికారి వెంకటేశ్వర్లు, హెచ్ పార్వతి, ఏఈఓ శ్రావణి, ఏఎన్ఎలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Tekulapalli : గ్రామాల స్థితిగతులు, పథకాల అమలుపై ఐఈఎస్ అధికారుల పరిశీలన