ఇల్లెందు, సెప్టెంబర్ 04 : తెలంగాణలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు తీరని అన్యాయం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన మాట మరిచి 6 గ్యారంటీలు 420 మోసాలపై ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని రోడ్డుపై వంటావార్పు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేంద్రతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్రంలో ఒక బీసీ మహిళను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి అవమాన పరిచిన తీరును చూస్తే రేవంత్ సర్కార్ తీరు అర్థమవుతుందన్నారు.
కాంగ్రెస్ అబద్ధపు పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తుందన్నారు. గత సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు దూరం చేస్తున్నట్లు మండిపడ్డారు. మహిళలకు ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా అన్ని రంగాలలో మహిళలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వంట వార్పు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టవు కానీ మాట్లాడితే ఢిల్లీకి మాత్రం వెళ్తారు. ప్రజా సమస్యలను సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బానోత్ హరి సింగ్ నాయక్, పట్టణ నాయకులు సుదర్శన్ రంగనాథ్, అబ్దుల్ జబ్బర్, సిలివేరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్, బర్మావత్ లాల్ సింగ్, శీలం రమేష్, జెకె శ్రీను, దాస్యం ప్రమోద్, తోట లలిత శారద, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, భవాని, గిన్నారపు రాజేష్, ఎంటెక్ మహేందర్, ఉపేందర్, రామ్ లాల్ పాసి, డేరంగుల పోశం, చాంద్ పాషా, భాష, బండారి శ్రీనివాస్, యేపే శంకర్, రాజ్ కోటి, రవికాంత్, గడ్డి శీను, నీలం రాజశేఖర్, కాసాని హరిప్రసాద్, సత్తల హరికృష్ణ, ఇమ్రాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రేవంత్ సర్కార్లో మహిళలకు తీరని అన్యాయం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర