బూర్గంపహాడ్, ఏప్రిల్ 13 : ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో బూర్గంపహాడ్ గురుకులం విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, గురుకులం ప్రిన్సిపాల్ హరిత సోమవారం విద్యార్ధులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ద్వితీయ సంవత్సరంలో ఎ.సంజన ఎంపీసీలో 992, పి.రమ్య బైపీసీలో 992 మార్కులు సాధించగా ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో సవీరా 467, బైపీసీలో డి.రమ్యశ్రీ 435 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారు.