ఇల్లెందు, సెప్టెంబర్ 08 : అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులచే ప్రభుత్వం చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. మహిళ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబిత ఇంద్రారెడ్డిపై ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ముందు మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్, ఉద్యమ నేత దిండిగల రాజేందర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రస్తుతం మహిళలపై తెలంగాణలో అనేక విధాలుగా దాడులు జరుగుతున్నట్లు తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ సాక్షిగా జరిగిన దాడిలో తీవ్ర ఇబ్బందిపడ్డ మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కీషిక పర్వం నడుస్తుందని, తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిట్టికొట్టాలని వారు పిలుపుని చ్చారు.
అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొనడంతో నీటితో నింపిన కుండలను పగలగొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్ రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు కటకం పద్మావతి, తోట లలిత శారద, మండల అధ్యక్షులు శీలం రమేష్, బొమ్మెర వరప్రసాద్ గౌడ్, అజ్మీరా బావు, దేవీలాల్, లాల్ సింగ్ అబ్దుల్ నబీ, జాఫర్ హుస్సేన్, గిన్నారపు రాజేష్, కాసాని హరిప్రసాద్, చాంద్ పాషా, హరికృష్ణ, డేరంగుల పోశం, ఘాజి, మూలగుండ్ల ఉపేందర్, మునిగంటి శివ, గడ్డి శీను, ఆర్ శీను, రవికాంత్, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్