ఇల్లెందులో బొగ్గు నాణ్యత వారోత్సవాలు-2026 ను ప్రారంభించిన జీఎం వి.కృష్ణయ్య
ఇల్లెందు ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభి౦చారు.
ఇల్లెందు, నవంబర్ 12 : ఇల్లెందు ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభి౦చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా ,అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన మన సింగరేణి దేశంలోని వివిధ సంస్థలకు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ మన దేశ ఆర్థిక ప్రగతిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నదని తెలిపారు.
అయితే ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థ కూడా తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఏ సంస్థకైనా దాని మనుగడను, పురోభివృద్ధి ఆ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకతలతో పాటు ఉత్పత్తి అయిన వస్తూ నాణ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎస్వో టు జియం జాకీర్ హుస్సేన్, డిజియం (ఐఈడి) ప్రభాకర్ రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఏరియా బొగ్గు నాణ్యతాధికారి రామదాసు, ఏరియా ఇంజినీర్ లక్ష్మణమూర్తి, డి.వై. (సివిల్) వినయ్ సాగర్, ఇతర అధికారులు, దిలీప్ కుమార్, రామమూర్తి, శివ వీర కుమార్, సుధాకర్, నరసింహారావు, చైతన్య, ప్రణతి, జగదేశ్ అధికారుల సంఘం నుంచి నాగేశ్వర్ రావు, గుర్తింపు సంఘం నుండి లచ్చిరాం, ప్రాతినిధ్య సంఘం నుంచి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

