రుద్రంపూర్, సెప్టెంబర్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా గిడ్ల అమృతరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్ గురువారం అమృతరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమృతరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు కృతజ్ఞతలు తెలిపారు.