కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 24 : దసరా సంబరాల సందర్భంగా నాల్గొవ రోజు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో కలెక్టరేట్లో నాన బియ్యం బతుకమ్మ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ముఖ్య అతిథిగా హాజరై గౌరమ్మకు పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు.
Kothagudem Urban : కొత్తగూడెం కలెక్టరేట్లో నాల్గొవ రోజు బతుకమ్మ వేడుకలు