చండ్రుగొండ, నవంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు పంచాయతీ పరిధిలో గల పోడు రైతుల భూముల్లో అటవీ శాఖ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో సుమారు 150 మంది ఫారెస్ట్ అధికారులు మంగళవారం సాయంత్రం చీకటి పడే సమయంలో కత్తులు, గొడ్డళ్లతో పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి పంటను ధ్వంసం చేసిన విషయం బుధవారం పత్తి చేనులకు వెళ్లిన పోడు రైతులు గుగులోతు లాలి, తేజావత్ సరోజా చూసి బోరున విలిపించారు.
గత 20 సంవత్సరాలుగా ఇదే పోడు భూముల్లో తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, విత్తనాలు చల్లి పంట సాగు చేసి చేతికొచ్చే సమయంలో ఫారెస్ట్ అధికారులు పత్తి చేను ధ్వంసం చేయడం తీవ్ర అన్యాయం అన్నారు. ఎకరానికి రూ.50 వేల వరకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఆ పెట్టుబడులు పంట రూపంలో చేతికి వచ్చే సమయంలో ఫారెస్ట్ అధికారులు నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేశారని పోడు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై చట్ట పరంగా పోరాటం చేస్తామని పోడు రైతులు తెలిపారు.

Chandrugonda : పోడు భూముల్లో పత్తి పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు

Chandrugonda : పోడు భూముల్లో పత్తి పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు