ఇల్లెందు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతే మత్స్య సంపద మరింత అభివృద్ది చెందు తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నాలుగు సొసైటీలు, అరవై ఏడు చెరువులకు కలిపి పది లక్షల డెబ్భై మూడు వేల చేప పిల్లలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య సంపద అభివృద్ది చెందుతుందన్నారు.
చెరువులు, కుంటల జలకళతో నిండుకుండలా కనిపిస్తున్నాయన్నారు. చేప పిల్లల పంపిణీ ద్వారా సొసైటీలకు, పంచాయతీలు ఆదాయం లభిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సొసైటీ, పంచాయతీలు ఆర్థికాభివృద్ది సాధించాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.