రామవరం, డిసెంబర్ 11 : గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావడానికి తాము ఎల్లప్పుడూ తోడుంటామని సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు అన్నారు. గురువారం విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య ఆధ్వర్యంలో ఇటీవల సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ గ్రామానికి చెందిన పొన్నాల పృథ్వీరాజ్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. 47వ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడలో ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న నేపథ్యంలో అతడి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని దాతలు రూ.20 వేల నగదును అతడికి అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ఉండి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితోని క్రీడల్లో రాణించి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేలా ఆడి గెలవాలని ఆకాంక్షించారు. పలువురు గ్రామస్తులు పృథ్వీరాజ్‌కు అభినందనలు తెలిపారు. క్రీడాకారుడికి జోసఫ్ రాజ్, అంతోటి నాగేశ్వరరావు, కిరణ్, లలిత్ కుమార్, గోపాల్ మెడికల్, చెరిపెల్లి, నాగరాజు, ప్రవీణ్, నాగేశ్వరరావు, గౌతం అంతా కలిసి రూ.17 వేలు అందజేశారు.