టేకులపల్లి, జనవరి 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన పలు పంచాయతీల సర్పంచులకు శనివారం జగదాంబ దేవి సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశాభివృద్ధి గ్రామాల అభివృద్ధితోనే సాధ్యం కావునా నూతన సర్పంచులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి, అలాగే అర్హులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమం అందేలా కృషి చేయాలని కోరారు.