రామవరం, సెప్టెంబర్ 08 : మధుమేహం, రక్తపోటు పెరగడానికి కారణం ఒత్తిడితో కూడిన జీవన విధానం, దీనిని జయించాలంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం చాలా అవసరమని డాక్టర్ డి.లలిత అన్నారు. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రాంపురం పంచాయతీలో కొత్తగూడెం ఏరియాలోని వెంకటేష్ ఖని కోల్ మైన్ పర్యావరణ అనుమతులలో భాగంగా రాంపురం గ్రామం నందు ఉచిత మెడికల్ క్యాంప్ ను సింగరేణి మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు నిర్వహించారు. షుగర్ వ్యాధి, బీపీ, గుండె సంబంధ, ఊబకాయానికి సంబంధించిన అవగాహన కల్పించారు. వివిద ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మెయిన్ హాస్పిటల్ హెల్త్ స్టాఫ్ నర్స్ రెహనా, వెంకటేష్ ఖని కోల్ మైన్ సంక్షేమ అధికారి ఎండి.ఖలీల్ అహ్మద్, ఫిట్ సెక్రటరీ ఏఐటియూసి యూనియన్ ఎం.ఆర్.కే.ప్రసాద్, ఫిట్ సెక్రటరీ, ఐఎన్టియూసి యూనియన్ గోపు కుమార్ పాల్గొన్నారు.