ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (VB G RAM G) పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా మేట్లు ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీవో, అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు. శుక్రవారం...
– రోజూ రూ.308 వేతనం అందేలా కొలతల ప్రకారం పనులు చేపట్టాలి
– ప్రశాంతి నగర్ రైతు వేదికలో మేట్లకు ప్రత్యేక శిక్షణ
చుంచుపల్లి, అక్టోబర్ 30 : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (VB G RAM G) పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా మేట్లు ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీవో, అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు. శుక్రవారం ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదికలో ఉపాధి హామీ మేట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదైందని, ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు చేతినిండా పని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో పనుల సంఖ్య పెంచడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు.
ఉపాధి కూలీలకు రోజుకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.308 గరిష్ఠ వేతనం లభించే విధంగా పనుల వద్ద కొలతలు (మార్కింగ్) ఇచ్చి పనులు చేయించాలని మేట్లకు స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వీడి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీడీవో సుభాషిని, ఏపీవో పోరండ్ల రంగా, ఈసీ యశ్వంత్, ప్రశాంతి నగర్ ఉప సర్పంచ్ స్వప్న, పంచాయతీ కార్యదర్శి శ్రీవాణి, సాంకేతిక సహాయకులు (టీఏలు) అనిల్, కోటేశ్వరరావు, వీరన్న, స్వాతి, క్షేత్ర సహాయకులు (ఎఫ్‌ఏలు) దేవదాస్, కేస్లీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
Dhanu-Dinu | సోషల్ మీడియా వేధింపులు.. ‘ది ట్రైటర్స్’ నటుడు ధనుంజయ్‌పై నటి పోలీసు ఫిర్యాదు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

