ఇల్లెందు, అక్టోబర్ 17 : పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గమని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. అలాగే బాలికలు సొంతంగా వారి కాళ్ల మీద వాళ్ల నిలబడేలా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపల్లి ఉమామహేశ్వర రావు, న్యాయవాది పిరమిడ వెంకటేశ్వర్లు, వార్డెన్ సునీత, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Yellandu : పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గం : జడ్జి కీర్తి చంద్రిక రెడ్డి