చుంచుపల్లి, జులై 11 : తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్లు, టైలు, బెల్ట్‌లు, ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా దాతల సహకారంతో విద్యార్థులకు, పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యానగర్ కాలనీ వాసి తాళ్లూరి మధు, సుజాత దంపతుల కుమార్తె మణి చందన (USA) ద్వారా రూ.5 వేలు విరాళంగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, వాసిరెడ్డి మురళి, సీపీఐ మండల కార్యదర్శి దుగ్గరాశి వెంకన్న, హెచ్ఎం నజియా, మాజీ ఎంపీపీ, సెక్రటరీ సురేశ్‌కుమార్, సభ్యులు సామినేని నాగేశ్వర్రావు, శివరామకృష్ణ, సీతారామశాస్త్రి, రాజేంద్రప్రసాద్, పాండురంగారావు, కామేశ్వరరావు, సాయిబాబా, ధర్మారావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, మోహన్ లాల్, తోట సమ్మయ్య, నసీరుల్లా, భాస్కరరావు పాల్గొన్నారు.