దుమ్ముగూడెం, జూలై 24 : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం మండల కేంద్రంలోని ములకపాడు పీహెచ్సీలో రోగులకు, గర్భిణీలకు పాలు, పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ కణితిరాముడు మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అన్నారు. రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చేసిన దమనకాండకు నిరసనగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా సామాజిక కార్యక్రమాలకు పిలుపునిచ్చిన కేటీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు రావులపల్లి పృధ్వీ, సొసైటీ డైరెక్టర్ కాల్వ పూర్ణయ్య, సీనియర్ నాయకుడు కొత్తూరి సీతారామారావు, పార్టీ ఉపాధ్యక్షుడు తునికి కామేష్, యూత్ నాయకులు లంక శివ, జీలకర్ర గంగరాజు, సూర్య, మాజీ సర్పంచ్ చందు, నరసింహ రావు, వాగి కిట్టు, బాలరాజు, రాము, ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.