బూర్గంపహాడ్, మే 19 : పారిశ్రామికవాడ సారపాకను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలోని గాంధీనగర్, భాస్కర్‌నగర్‌లో రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన 17 సీసీ రోడ్లను సర్పంచ్ కిషోర్నాయక్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చుతూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన భూక్యా అరుణ, తేజావత్ జానకి లబ్దిదారుల ఇందిరమ్మ ఇళ్లకు ఆయన గృహప్రవేశం చేశారు.
అదేవిధంగా ఇటీవల అనారోగ్యానికి గురైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి నివాసానికి పాయం వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే.ప్రసాద్, పీఆర్ డీఈ పొదెం వెంకటేశ్వరరావు, ఈఏ చక్రధరా చారి, సర్పంచ్ మందా నాగరాజు, నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీష్, భజన ప్రసాద్, మహిమూదఖాన్, మారం వెంకటేశ్వరరెడ్డి, వారాల వేణు, చంటి, బాలి శ్రీహరి, చల్లా వెంకటనారాయణ, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.