చుంచుపల్లి, జూలై 14 : రుద్రంపూర్ గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం మట్టి ఇటుకల తయారీ ప్రక్రియను కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ఇటుకల తయారీలో గల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తయారీలో మెళకువలను వారికి స్వయంగా చేసి చూపించారు. కూలీలు ఎక్కువగా ఉన్నందున తయారీ ప్రక్రియ వేగవంతం కావడానికి అదనంగా రెండు ఇటుకల తయారీ మిషన్లను అందజేస్తామని తెలిపారు. పర్యావరణానికి హాని జరుగకుండా మట్టి ఇటుకల వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుభాషిని, ఎంఈఓ బాలాజీ, మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర ప్రసాద్, ఏపీఓ రఘుపతి, ఈసీ నాగరాజు, టీఏ అనిల్, ఎఫ్ఏ కేస్లీ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.