Jitesh V Patil | దివ్యాంగ విద్యార్థుల వరం భవిత కేంద్రాలు : కలెక్టర్ జితేశ్వి పాటిల్
Jitesh V Patil | దివ్యాంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుగా భవిత కేంద్రాలు ఉపయోగపడుతు న్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ (Collector Jitesh V Patil) అన్నారు.
పాల్వంచ ఫిబ్రవరి 21 : దివ్యాంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుగా భవిత కేంద్రాలు ఉపయోగపడుతు న్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ (Collector Jitesh V Patil) అన్నారు. పాల్వం చలోని భవిత కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలతో ఇంటరాక్ట్ అయి పిల్లల ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ అనే విద్యార్థి భవిత కేంద్రంలో అందించిన ఫిజియో థెరపి ద్వారా మంచానికి పరిమితం అయిన స్థితి నుండి స్వయంగా నిలబడి నడవగలిగే స్థితికి వచ్చిన విద్యార్థి సక్సెస్ స్టోరీని స్వయంగా విని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ITI చదువుతున్న అబ్దుల్ అజీజ్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలు దేవుడిచ్చిన వరంగా భావించాలన్నారు. వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్ కు పంపడానికి సిబ్బంది కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
రానున్న కాలంలో దివ్యాంగ పిల్లలకు సమ్మిళిత విద్యను భవిత కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో అందించేందుకు చేపట్టాల్సిన కార్యకలాపాలపై పక్కా ప్రణాళికను రూపొందించి దివ్యాంగ పిల్లలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి, సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ యస్.కె. సైదులు, మండల విద్యాధికారి శ్రీరామ్మూర్తి, రిసోర్స్ పర్సన్స్ శ్రీరామ్, కనక దుర్గా, అరుణ కుమారి, అనిత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

