ఇల్లెందు, జులై 8 : పత్తి సాగు చేసే ప్రతి రైతు మునగ సాగుపై దృష్టి సారించాలి అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం టేకులపల్లి మండలం రాంపురంలో మునగ తోట సాగు చేస్తున్న రైతు గాంధీ మునగ తోటను సందర్శించి రైతును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఆసక్తిగల రైతులు మునగ తోటల పెంపకంపై మొగ్గు చూపాలన్నారు. ఎక్కువ మొత్తంలో సాగు చేయాలని రైతులకు సూచించారు. మునగ తోటలతో అన్నదాతలకు అధిక ఆదాయం వస్తుందన్నారు. అలాగే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిలువు నీరు లేకుండా చూడాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ పాలసీ లను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో కుమారి బి మల్లేశ్వరి , మండల పంచాయతీ అధికారి జక్కుల గణేష్ గాంధీ, మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, ఉపాధి హామీ పథకం అదనపు అధికారి కాళంగి శ్రీనివాస్, ఇందిరా క్రాంతి పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి గణపవరం రవికుమార్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ మొగిలి తిరుపతయ్య, కార్యదర్శ రాజశేఖర్ ,సీసీలు శ్రీలత, సునీల్,సురేష్ ,సాగర్, భాగ్యశ్రీ, గాంధీ, బాలు తదితరులు పాల్గొన్నారు.