బూర్గంపహాడ్, మార్చి 24 : మండల కేంద్రమైన బూర్గంపహాడ్ బాలుర ఆశ్రమ గిరిజన పాఠశాలకు హైదరాబాద్‌కు చెందిన వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సంస్థ ఆర్ధిక సహకారం సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఫౌండర్ రామ్‌కుమార్ రూ.3.50 కోట్లతో అదనపు తరగతి గది, వాష్ రూమ్ నిర్మాణాన్ని చేపట్టి మంగళవారం విద్యార్ధుల సౌకర్యార్థం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ రామ్‌కుమార్ లాంఛనంగా ఈ నిర్మాణాలను ప్రారంభించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన విద్యార్ధులకు మౌలిక వసతులు కల్పించడం తమ సంస్థ సమాజ బాధ్యతగా పేర్కొన్నారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్‌కు దోహద పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గిరిజన పాఠశాల హెచ్ఎం మోహన్‌లాల్, ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్ధులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.