రామవరం, జూన్ 30 : హాయిగా ఆడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన బాల్యం బాధ్యతల మధ్య బంధీ అయింది. బడిలో ఉండాల్సిన పిల్లలు పనుల్లో నిమగ్నమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి పదవి విరమణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేశారు. భోజనం ఏర్పాట్ల కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేశారు. అయితే క్యాటరింగ్ నిర్వాహకులు చిన్నారుల చేత కార్యక్రమంలో పనులు చేయించారు. అధికారులు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేసే కృషి కలెక్టరేట్లో కూడా పాటిస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. బాధ్యత లేకుండా బాల కార్మికుల చేత పనులు చేయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.