లక్ష్మీదేవిపల్లి, జనవరి 30 : మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ శ్రేణులు శుక్రవారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్కు సిట్ నోటీసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బూటకపు కేసులు, విచారణలు పక్కనపెట్టి ముందు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనులపై దృష్టి సాధించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు ఇగ్బాల్ పాషా, ప్రశాంతి నగర్ ఉప సర్పంచ్ ఎర్రబడి శ్రీను, శ్రీకాంత్ నాయక్, మాజీ సర్పంచులు తాడూరి రజాక్, కోరం చంద్రశేఖర్, పొదిలి వెంకటాచలం, బీఆర్ఎస్ మండల నాయకులు రాజావరపు మురళి, కల్లుగడ్డ సురేష్, పరిపూర్ణ చారి, లాల్ తండా శీను, గట్టిగుట్ట వెంకటేష్, గడ్డిగుట్ట రవి, హరిచంద్, హేమ్లా, రేగల రమేష్, బావోజీతండా రమేష్, భూక్య హుస్సేన్, చరణ్ పాల్గొన్నారు.