చుంచుపల్లి, జూలై 19 : చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీలో గల సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జెరోమియాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల బాలికలు వివిధ వేషధారణలో అలరించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు బోనాలు ఎత్తుకుని సాంప్రదాయమైన నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమానికి బ్రదర్ దయాబాన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.