బూర్గంపహాడ్, జూన్ 10 : డివైడర్ను ఆటో ఢీకొనగా డ్రైవర్ మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక గాంధీనగర్లో నివసిస్తున్న శివ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి సారపాక వారాంతపు సంత నిర్వహించే ప్రాంతం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా పల్టీకొట్టడంతో డ్రైవర్ శివ కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, వాహనదారులు చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి శివను తరలించగా కొద్దిసేపటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.