రామవరం, జూలై 19 : విద్యుత్ కేబుల్‌ను చోరీ చేసి దాని నుంచి కాపర్‌ను తీస్తున్న క్రమంలో ఎస్ అండ్ పి సి సిబ్బంది రైడ్ చేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకే ఓసిలో చోటుచేసుకుంది. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో జీకే ఓ సి బెల్ట్ సెక్షన్, క్రషర్ ప్రాంతంలో నిఘా వేయగా కొంతమంది దొంగలు కేబుల్ వలుస్తుండగా గమనించారు. వెంటనే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా దొంగలు సిబ్బందిని చూసి పారిపోయారు.
సుమారు 35 మీటర్ల కాపర్ కేబుల్ ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ ఘటనపై టూ టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ రైడ్‌లో జూనియర్ ఇన్స్పెక్టర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, స్పెషల్ టీం ఎం. శ్రీనివాస్, కె.సురేశ్, పి.విజయ్, సుల్తాన్ క్రాంతి, ఇంటలిజెన్స్ రాంబాబు, మల్లికార్జున్, షిఫ్ట్ జమేదార్ కె.కుమార్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు.