రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే ‘అరైవ్-అలైవ్’
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే 'అరైవ్-ఆలైవ్' అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 15 : రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే ‘అరైవ్-ఆలైవ్’ అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అవగాహన కల్పించారు. అనంతరం ప్రధాన సెంటర్లో వచ్చి పోయే వాహన పత్రాలను తనిఖీ చేసి వారికి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్ధులు, ప్రజలు, వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంఈఓ యదుసింహరాజు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

