రామవరం, జూలై 15 : సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SIMS), రామగుండం కాలేజీ నందు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాల కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, వరంగల్, తెలంగాణ స్టేట్ కిందకు వస్తుందన్నారు. అర్హత కలిగిన సింగరేణి అధికారుల, ఉద్యోగుల పిల్లలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే యువతీ యువకులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలన్నారు.
1. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చే నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నందు ఉత్తీర్ణులై ఉండాలి.
2. నీట్ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా వారికి స్పాన్సర్షిప్ కల్పించడం జరుగుతుంది.
3. స్పాన్సర్స్షిప్ కేవలం సింగరేణి (అధికారుల & ఉద్యోగుల) పిల్లలకు మాత్రమే
4. సింగరేణి (అధికారుల & ఉద్యోగుల) పిల్లలు (మగ/ఆడ)అర్హులు.
5. ఉద్యోగస్తుల సౌకర్యార్థం ఈ మెడికల్ సీట్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వారి సంబంధిత మైన్స్/ డిపార్ట్మెంట్లలో సంప్రదించి తేదీ 25.07.2025 లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.