రామవరం, నవంబర్ 19 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2025–26 వార్షిక సంవత్సరానికి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నిర్వహించేందుకు మహిళా శిక్షకురాళ్ల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, అలాగే జికేఓసీ, వికే కోల్ మైన్స్ పరిసర ప్రభావిత గ్రామాల మహిళా అభ్యర్థులు ఆసక్తి, అర్హత, అనుభవం కలిగి ఉన్నవారు ఈ నెల 30వ తేదీ లోపు కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్కి తమ దరఖాస్తులు సమర్పించవచ్చు అని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరచాలని సూచించారు.