చుంచుపల్లి, ఆగస్టు 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విభాగంలో గ్రేడ్ వన్ మేనేజర్‌గా పాల్వంచ ఎల్పీజీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ ఉత్తమ సేవా పురస్కరం అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతి మైదానం గ్రౌండ్స్ లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.