ముస్తఫాకు అంబేద్కర్ జాతీయ అవార్డు
అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అభ్యుదయ రత్న–2026 అవార్డును రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా అందుకున్నారు.
రుద్రంపూర్, ఏప్రిల్ 16 : అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అభ్యుదయ రత్న–2026 అవార్డును రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా అందుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లిలో గల త్యాగరాయ గానసభలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖుల సమక్షంలో ముస్తఫాకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ ఫౌండర్, నేషనల్ చైర్మన్ డా. కె. చక్రవర్తి, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, న్యూమరాలజిస్ట్ దివంగ శర్మ, రిటైర్డ్ జడ్జి బూర్గుల మధుసూదన్, రిటైర్డ్ ఐఏఎస్ బి.లక్ష్మీకాంతం, రిటైర్డ్ ఎస్పీ ఎస్.ఎం. రత్న, అష్టావధాని సురభి శంకర శర్మ, రిటైర్డ్ డీఎస్పీ డాక్టర్ జి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రామవరం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు, కరపత్రాలు, కవితల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పిస్తున్నందుకు గాను ముస్తఫా ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ముస్తఫాను ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, సుగుణారావు, తూముల శ్రీనివాస్, సావేటి స్వామి, నజీర్, తులసి రామ్, యశ్వంత్, కొయ్యడ వెంకటేశ్వర్లు, రాజారాం, దశరథ్ రజ్వ తదితరులు అభినందించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

