కాకర్ల ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి 30 కుర్చీలు వితరణ
ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి, పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని జూలూరుపాడు మండలం కాకర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు..
జూలూరుపాడు, జూలై 03 : ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి, పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని జూలూరుపాడు మండలం కాకర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.విజయ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పాఠశాల పూర్వ విద్యార్థి, హైదరాబాద్ మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ బత్తుల నరసింహారావు 30 ప్లాస్టిక్ కుర్చీలను వితరణ చేశారు. గ్రామస్తుడు మిర్యాల రమేష్ ప్రత్యేక చొరవ, సహకారంతో దాత అందజేసిన కుర్చీలను పాఠశాల హెచ్ఎంకు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. దాత నరసింహారావుకు, సహకరించిన రమేశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రూప్లా, వాలంటీర్ కె.అనూష, అంగన్వాడీ టీచర్ నాగమణి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

