కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 30 : అమ్మ దయతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని గాజులరాజం బస్తీలో దుర్గా మాతా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంను ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత మాజీ కౌన్సిలర్లు ఎండీ.యూసుఫ్, మహమ్మద్ సాహెరా బేగంల సమక్షంలో ఎమ్మెల్యే కూనంనేని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ దయతో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. సాంప్రదాయాలతో పూజ నిర్వహించుకోవడంతో పాటు భక్తులకు అన్నసంతర్పణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సిపిఐ సీనియర్ నాయకులు గడ్డం రాజయ్య, గడ్డం ప్రభాకర్, గడ్డం సతీశ్, అమ్మవారి మండప కమిటీ సభ్యులు ఆరె తేజ, భాను, నరేశ్, మసూద్, లలిత్, హరీష్, నాగార్జున, రమేశ్ పాల్గొన్నారు.
Kothagudem Uraban : కొత్తగూడెం అభివృద్ధికి అన్ని విధాలా కృషి : ఎమ్మెల్యే కూనంనేని