భద్రాచలం, ఆగస్టు 15 : భద్రాచలం పట్టణంలో పంద్రాగస్టు వేడుక నాడు జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పట్టణంలోని చర్ల రోడ్‌తో పాటు ఐటీడీఏ రోడ్, టెంపుల్ రోడ్, పలు కాలనీల్లో, ప్రధాన రహదారిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజుల్లో అమ్మే రేట్ల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ విక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు మద్యం అమ్మకాలు నిషేధం అన్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం దుకాణాల నుంచి బెల్ట్‌షాపు యజమానులకు ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు కొనుగోళ్లు చేసి నిల్వ చేశారు. షాపుల వద్ద బహిరంగంగానే మందుబాబులకు విక్రయిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం అటుగా కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.